శంషాబాద్‌లో ఘోరం..  కుమార్తెలపై ఏడాదిగా తండ్రి అత్యాచారం

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. ఇద్దరు కుమార్తెలపై తండ్రి ఏడాదిగా అత్యాచారం జరిపాడు. శంషాబాద్ హైమద్ నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే 60 ఏళ్ల రాజ్ బహదూర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇంటికి తరచూ వెళ్లే ఇద్దరు మైనర్ కూతుళ్ళపై తండ్రి రాజ్ బహదూర్ అత్యాచారం చేసే వాడని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. వీరు నేపాల్ నుంచి వలన వచ్చిన కుటుంబమని స్థానికులు తెలిపారు. ఘటనతో శంషాబాద్‌లో కలకలం రేగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*