
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో పాము కాట్ల కలకలం కొనసాగుతోంది. జిల్లాలోని అనేక మండలాల్లో గడచిన నాలుగు నెలల కాలంలో 300 మంది పాముకాట్లకు గురయ్యారు. 22 రోజుల్లో 86 మంది పాము కాట్లకు గురయ్యారు. గడచిన 12 రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. తాజాగా బాపులపాడుకు చెందిన మహిళ పాముకాటుకు చనిపోయారు. అవనిగడ్డ ఆసుపత్రికి పాముకాట్లకు గురైనవారు క్యూ కడుతున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.
పొలాల్లో ఎలుకల కోసం కలుగుల్లో దాగుండే పాములను వరినాట్లకు ముందే బయటకు పోయేలా చేయాలంటే విషగుళికలు వేయాలనే విషయంపై రైతుల్లో అవగాహన కల్పించలేకపోతున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి. నిపుణుల సలహాలు తీసుకుని అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు చంద్రబాబు సర్కారును కోరుతున్నారు. సీఎం ఈ విషయంపై ఫోకస్ పెట్టినా అధికారులు తగిన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీఎం మరింత లోతుగా విషయాన్ని పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.
Be the first to comment