కేరళకు సన్నీ సాయం 5 కోట్లు కాదు.. 1.3 టన్నుల…

ముంబై: వరదలతో అతలాకుతలమైన కేరళకు బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ సాయం ప్రకటించింది. 1200 కేజీల ఆహార పదార్ధాలను అందించింది. 1.3 టన్నుల బియ్యం, పప్పు పంపించింది. రాబోయే రోజుల్లో మరింత సాయం అందిస్తామంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తన భర్త డేనియల్‌తో దిగిన ఫొటో కూడా జత చేసింది.

 

వాస్తవానికి సన్నీ 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను సన్నీ ధృవీకరించలేదు. తాజాగా 1200 కేజీల ఆహార పదార్ధాలు పంపడంతో ఆమె సాయం ఇదేనని స్పష్టం చేసినట్లైంది. భవిష్యత్తులో మరింత సాయం చేస్తానని మాత్రం సన్నీ ప్రకటించింది. సన్నీ కేరళ వెళ్లినప్పుడు జనం పోటెత్తారు. తమ అభిమానం చాటుకున్నారు. దీంతో సన్నీ కేరళతో కనెక్ట్ అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*