చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ సమాధి!

చైనాలోని హార్బిన్ నగరంలోని ఓ రిసార్ట్ హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐలాండ్ రిక్రియేషన్ ప్రాంతంలోని బీలింగ్ హాట్‌స్ప్రింగ్ హోటల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్‌ సిబ్బంది, వినియోగదారులు హాహాకారాలు చేస్తూ బయటపడే పరుగులు తీశారు. అయితే, క్షణాల్లోనే చుట్టుముట్టిన మంటలు 19 మందిని పొట్టన పెట్టుకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 105 మంది సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో 16 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. హోటల్‌లో చిక్కుకున్న 70 మంది రక్షించి వేరే ప్రాంతానికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*