
కుట్రలతో తెలుగుదేశం పార్టీని బలహీన పర్చాలనుకోవడం తెలివి తక్కువ పని అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం కర్నూలోని ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ధర్మపోరాట సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ చీఫ్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయాలపై అవగాహన లేనివారు, అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు తనను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై కుట్రలు చేసేందుకే కొత్త పార్టీలు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని, అటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోదని తేల్చి చెప్పారు. నిన్నమొన్నటి వరకు పవన్ కల్యాణ్‌కు తాను బాగానే కనిపించానని, కానీ ఇప్పుడు ఆయన కూడా తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ బోసిపోయేలా అమరావతిని నిర్మిస్తామని తిరుపతి సభలో హామీ ఇచ్చిన మోదీ.. తర్వాత మోసం చేశారన్నారు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Be the first to comment