రాబోయే రోజుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్: సీఎం చంద్రబాబు

కడప: వనం-మనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ దూరదృష్టితో ఆలోచించి నీరు- ప్రగతి, నీరు- చెట్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని,  57 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు.  పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ జూన్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు.

వనం-మనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

నదుల అనుంసధానానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం

– పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులు అనుసంధానం చేశాం

– రాయలసీమలోని కరువు ప్రాంతాలకు నీరిస్తున్నాం

– ఖర్చు ఎంతైనా గండికోట ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం

– తెలుగు గంగ, ఎస్సాఆర్1,2, పైడిపాలెం,చిత్రావతి ప్రాజెక్టుల్లో నీరుండేలా చూస్తాం

-కుప్పానికంటే ముందు పులివెందుకు నీళ్లిస్తామన్న మాట నిలబెట్టుకున్నాం

– చిత్రావతి ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరిస్తున్నాం

– సరిగ్గా నీరందిస్తే కడప జిల్లా హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది

– అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నాం

– రాయలసీమను రతనాల సీమగా చేస్తాం

-జ్ఞానభేరి ద్వారా విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం

– త్వరలోనే కడపలో జ్ఞానభేరి

 

వనం-మనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

 

– ప్రకృతిని కాపాడుకోకపోతే మన భవిష్యత్ నాశనమవుతుంది

– అందుకే మిషన్ హరితాంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం

– 5లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేలా చేశాం

– రాష్ట్రం మొత్తం ఉన్న రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే లక్ష్యం. అందులో కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసేలా చేస్తాం

– రాయలసీమలో 50 శాతం వర్షపాతం తక్కువగా ఉంది

–15 లక్షల క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలోకి కలిసిపోయాయి

–కడప జిల్లాలోని అన్నిరిజర్వాయర్లుకు 90 టీఎంసీలు మాత్రమే అవసరం

– గోదావరి నీరు కడప జిల్లాలు తీసుకురాగలిగితే కడప జిల్లా సస్యశ్యామలం అవుతుంది

– అందుకే నదులను అనుసంధానం చేయాలని నేను ఆలోచించాను

– మొదటి విడతగా.. పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణాను అనుసంధానం చేశాం

– రాబోయే రోజుల్లో గోదావరి- పెన్నా నదులను అనుసంధానం చేసి గోదావరి నీళ్లు సోమశిలకు తీసుకొస్తాం

– వంశధార,నాగావళి,గోదావరి, కృష్ణా, పెన్నా నదులతో ఒక మహా సంగమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడతాం

 

వనం-మనం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

 

–ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం

– ప్రపంచంలోనే ఐదు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాం

– రాబోయే రోజుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం

–దళారుల ప్రమేయం లేకుండా అన్ని పనులు నేరుగా కావాలనే ఈజ్ ఆఫ్ లివింగ్ తీసుకొస్తున్నాం

– సాంకేతికతను ఉపయోగించి అర్హులందరికి పెన్షన్, రేషన్, చంద్రన్నబీమా వచ్చేలా చేస్తున్నాం

–గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టకుండానే రూ.4 వేల కోట్లు దోచేశారు

–భూ రికార్డులు తారుమారు కాకుండా భూదార్ ను తీసుకొస్తున్నాం

– మన రాష్ట్రంలో ఎవరు ఎక్కడా ఉండాలన్నా.. ఆనందంగా ఉండే పరిస్థితిని తీసుకొస్తాం

–ఒక నాలెడ్జ్ ఎకనామిగా హైదరాబాద్ ను 9 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశా

–కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం

– భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేసుకోవాలనేదే కర్తవ్యం

–కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్, బీటెక్ రవి నిరాహార దీక్ష చేశారు

– కడలో స్టీల్ ప్లాంట్ పెడితే ఎక్కువగా కేంద్రానికే ఆదాయం వస్తుంది

– ఇక్కడి నాయకులు కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు

– ఇక్కడి పిల్లల భవిష్యత్ కోసం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టితీరుతాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*