
అచ్యుతాపురం: మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన కలుసుకున్నారు. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురంలో ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద వైయస్ జగన్ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇద్దరూ 15 నిమిషాల పాటు చర్చించుకున్నారు.
యలమంచిలి: అచ్యుతాపురం పాదయాత్ర శిబిరంలో వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిజిపి సాంబశివరావు.#PrajaSankalpaYatra pic.twitter.com/ENc9lLp36J
— YSR Congress Party (@YSRCParty) August 25, 2018
అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సాంబశివరావు వైసీపీలో చేరబోతున్నారని వెల్లడించారు. సాంబశివరావు రాకతో వైసీపీకి అదనపు బలం చేకూరుతుందన్నారు.
మరోవైపు తాను వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను సాంబశివరావు ఖండించారు. తాను మర్యాదపూర్వకంగా మాత్రమే ప్రతిపక్షనేతను కలుసుకున్నానని సాంబశివరావు చెప్పారు.
This post is also available in : English
Be the first to comment