పంటకాల్వలోకి దూసుకెళ్లిన కారు.. బ్యాగ్‌కోసం వెళ్లి గల్లంతైన ఎస్ఐ వంశీ

కృష్ణా: కృష్ణాజిల్లాలో అవనిగడ్డ-బెజవాడ కరకట్టపై పాపవినాశం వద్ద కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రామచంద్రాపురం ఎస్‌ఐ వంశీ గల్లంతయ్యారు. కరకట్ట మీదుగా ఎస్‌ఐ వంశీ తన తల్లితో కలిసి కారులో స్వగ్రామం అవనిగడ్డలోని కోడూరు ఇస్మాయిల్‌బేగ్‌పేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వంశీ కోసం గాలింపు జరుపుతున్నారు.

ఇరుకు రోడ్డు కావడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు. వంశీ తల్లిని వంశీయే కాపాడారు. ఆ తర్వాత కారులో ఉండిపోయిన బ్యాగ్ తెచ్చేందుకు వెళ్లి గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. వంశీ తల్లిని అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు.

ఘటన కృష్ణా జిల్లాలో కలకలం సృష్టించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*