
ఘంటసాల: కృష్ణా జిల్లా ఘంటసాల వద్ద నిన్న కాలువలో గల్లంతైన ఎస్ఐ వంశీధర్ మృతదేహం లభ్యమైంది. నిన్న అర్ధరాత్రి వరకూ గాలింపు కొనసాగించారు. అన్నవరం మంగలపురం కలువ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం సుమారు 30 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. కొద్ది సేపటి క్రితం ఎస్ఐ మృతదేహంగా గుర్తించారు. గాలింపు చర్యల్లో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా అవనిగడ్డ-బెజవాడ కరకట్టపై పాపవినాశం వద్ద రామచంద్రాపురం ఎస్ఐ వంశీ తన తల్లితో కలిసి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది. డ్రైవింగ్ సీటులో ఉన్న తాను తన తల్లిని కాపాడి ఆ తర్వాత కారులో ఉండిపోయిన బ్యాగ్ కోసం మళ్లీ వెళ్లారు. కాల్వలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. గల్లంతయ్యారు. చివరకు 30 కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది.
ఎస్ఐ వంశీ స్వగ్రామం అవనిగడ్డలోని కోడూరు ఇస్మాయిల్బేగ్పేటలో విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నీరుమున్నీరౌతున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. తమ సహచరుడిని కోల్పోయిన పోలీసులు విషాదంలో మునిగిపోయారు.
Be the first to comment