అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై: అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి బాండ్లు లిస్ట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు ఆర్జించామన్నారు. గతంలో నగరాలను అనుసంధానం చేసేందుకు విమాన సర్వీసులు ఉన్నాయని, విమాన సర్వీసులు ఉన్నా ఎగిరేందుకు అనుమతులు వచ్చేవి కాదన్నారు. తాను జోక్యం చేసుకుని వివిధ నివేదికలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కేంద్రానికి ఆ తర్వాత ఓపెన్ స్కై పాలసీ వచ్చిందని, శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా నిర్మించగలిగామని చెప్పారు. ఒక్క విమానాశ్రయం తెలంగాణలో 50 శాతానికి పైగా స్థూల ఉత్పత్తిని సాధిస్తోందని తెలిపారు. ఒక ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ఒక లక్ష్యం, విజన్ కావాలని, అందుకే గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు.

 

చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

– సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటించా.
– అందుకు సాయం చేయమని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరాం.
– డబ్బు తీసుకోకుండా వారు అమరావతి మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు.
– ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని అమరావతి అవుతుంది.అందులో ఎలాంటి సందేహం లేదు.
– 2029కల్లా ఒక ట్రిలియల్ డాలర్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనేదే లక్ష్యం.
– ప్రస్తుతం ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈగవర్నెన్స్ రంగాల్లో నెం1 స్థానంలో ఉంది.
– కొత్త ఎయిర్ పోర్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

 

చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

– గతంలో కష్టాల్లో ఉన్న హైదరాబాద్ ను అభివృద్ది చేశా.
– ప్రధానిని ఒప్పించి ఒపెన్ స్కై పాలసీని తీసుకొచ్చాం.
– నీటి సమస్యను తీర్చేందుకు ప్రపంచ బ్యాంక్ ను అప్పడిగితే లీటర్ కు రూ.20 ఛార్జీ చేస్తే ఇస్తామంది.
– ప్రభుత్వ నిధులతోనే ఒక సంవత్సరంలో కృష్ణా నది నుంచి 5టీఎంసీల వాటర్ ను హైదరాబాద్ కు తెప్పించాం.
– ఏ ప్రాజెక్ట్ రావాలన్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం.
– చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ ను నిర్మించాం.
– రాష్ట్ర విభజన తర్వాత అద్భుతమైన నగరం లేదు, భూమి లేదు
– రైతులను ఒప్పంచి 35 వేల ఎకరాలు సమీకరించాం
– సింగపూర్ నుంచి బృహత్తర ప్రణాళిక రూపకల్పన చేయించి నిర్మాణంలో పెట్టాం
– మాపై విశ్వసనీయతతో రూపాయి తీసుకోకుండా సింగపూర్ బృహత్తర ప్రణాళిక ఇచ్చింది
– ప్రపంచంలో ఐదో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం
– 2029లో ఒక ట్రిలియన్ డాలర్ సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
– మౌలిక సదుపాయాలు, వనరులు మా సొంతం
– బీఎస్ఈ మాదిరిగా మా రాష్ట్రం కూడా ప్రగతి పథంలో దూసుకుపోతోంది
– ఐటీ రంగంలో ఎక్కువమంది నిపుణులు భారత్ నుంచి ముగ్గురు ఉంటే అందులో ఏపీ నుంచి ఒకరు ఉంటారు.

చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే!

– సన్‌రైజ్ ఏపీగా మా రాష్ట్రానికి పేరు పెట్టాం
– సౌరశక్తిని వినియోగించుకుని ప్రగతి దిశగా వెళ్లాలన్నది మా లక్ష్యం
– 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగర నిర్మాణం జరుగుతుంది
– ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఏపీలోనే జరిగింది
– వాక్ టు వర్క్ అన్నది అమరావతి నినాదం
– హరిత భవనాల నిర్మాణం చేపట్టి 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించడం లక్ష్యం
– కాలుష్య రహిత నగరంలో నివసించాలనుకునే ముంబయి వాసులకు స్వాగతం
– అమరావతిలో ముంబయి వాసులు ఇళ్లు కట్టుకునేందుకు స్వాగతం పలుకుతున్నాం
– రాజధాని కలను నిజం చేసుకునేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం
– 44 నెలలుగా అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*