
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించారు. వెంకయ్యనాయుడు దంపతులు సుష్మాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్విటర్ ద్వారా దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ సంస్కృతికి భిన్నంగా స్త్రీలపై దాడులు, వివక్ష, అత్యాచారాలు జరగడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రక్షాబంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సోదర-సోదరీ భావన పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
సోదరి, సోదరుల అవ్యాజమైన ప్రేమకు, భారతీయ సంస్కృతికి చిహ్నంగా జరుపుకునే రక్షా బంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తమ సోదరులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ సోదరీ మణులు కట్టే రక్షా బంధనానికి ఎంతో పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది. #RakshaBandhan pic.twitter.com/up8v5YT1Mg
— VicePresidentOfIndia (@VPSecretariat) August 26, 2018
మన సంస్కృతికి భిన్నంగా స్త్రీల పట్ల వివక్ష, అత్యాచారాలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యలకు వ్యతిరేకంగా ఒక్కటి కావడమే మనమిచ్చే రాఖీ పౌర్ణమి బహుమతి. రక్షాబంధన్ సందర్భంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలని, సోదర-సోదరి భావన పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. #RakshaBandhan
— VicePresidentOfIndia (@VPSecretariat) August 26, 2018
మరోవైపు ప్రధాని మోదీ చిన్నారులతో కలిసి రక్షాబంధన్ జరుపుకున్నారు. చిన్నారులు మోదీకి రాఖీలు కట్టారు. కొద్దిసేపటి క్రితం మోదీ ఆకాశవాణి మన్‌కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
The Prime Minister conveys Raksha Bandhan greetings during #MannKiBaat. https://t.co/CbSYmu66bw pic.twitter.com/rrZWfhya14
— PMO India (@PMOIndia) August 26, 2018
Be the first to comment