ఏపీ … పెట్టుబడులకు స్వర్గధామం.. పారిశ్రామిక దిగ్గజాలకు చంద్రబాబు పిలుపు

అమరావతి: “ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. బీఎస్ఈ లో సీఆర్డీఏ కి చెందిన అమరావతి బాండ్ల లిస్టింగ్ బెల్ మోగించిన ముఖ్యమంత్రి పలువురు ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. సులభతర వాణిజ్యానికి అనువుగా ఉన్న రాష్ట్రంగా గ్లోబల్ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే అటు పెట్టుబడిదారులకు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాల ప్రయోజనమని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ కు తాను చేసిన అభివృద్ధి ద్వారా ఒక మంచి పేరు తెచ్చి పెట్టగలిగామని, అలాగే అమరావతి ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయతలపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధితో జోడించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నామని ఆయన అన్నారు.

బీఎస్ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి:

ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ కేంద్రాంనొకదానిని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ఈ అధికారులను కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్ అని దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రియల్ టైం గవెర్నెన్స్ రాష్ట్ర పాలన లో ఒక కీలక భూమిక పోషిస్తోందని, సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ-ఆఫిస్, కంటెంట్ కార్పొరేషన్ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రశంసలు కురిపించారు. పెట్టుబడులకు మంచి అవకాశాల గనిగా ఆంధ్రప్రదేశ్ ను బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ అభివర్ణించారు.చంద్రబాబు పాలన లో పెట్టుబడులు ఆకర్షించటంలో ఏపీ అగ్రస్థానమ్ లో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోంచటంలో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. అమరావతి నిర్మాణం కూడా అద్భుతగా సాగుతోంది. నగర నిర్మాణం లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్లు జారీ చేయటం మంచి ఆలోచన అని ఆశిష్ కుమార్ తెలిపారు. “1998 లో అహ్మదాబాద్ నిర్మాణం కోసం మున్సిపల్ బాండ్లు జారీ అయ్యాయి. ఆగస్టు 14 న అమరావతి బాండ్లు ట్రేడ్ అయ్యాయి. గంటలో 2000 కోట్లు ఆర్జించాయి. ఏపీ అభివృద్ధి లో బీఎస్ఈ కూడా భాగస్వామ్యం వహిస్తున్ననందుకు సంతోషంగా ఉంది. అని ఆశిష్ కుమార్ అన్నారు.

తాజ్ పాలెస్ లో పారిశ్రామిక వేత్తలకు అమరావతి పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్.

ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలని మేం విజన్ రూపొందించుకున్నాం. ఏపీలో వనరులు ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్ గా ఉండాలన్నది మా లక్ష్యం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా అగ్రస్థానంలో ఉంటోంది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ , బెంగుళూరు- చెన్నై కారిడార్, కర్నూలు- చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లు నిర్మిస్తునామ్. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక , ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విధానాలు ఉన్నాయి. అభి వృద్ధి చేసిన భూ బ్యాంకు అందు బాటులో ఉంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కి ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్ లో విద్యుత్ చార్జీలు పెంచబోము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు.

పారిశ్రామిక వేత్తలు నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుని వారికున్న ఇబ్బందులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వ్యాపారం చేస్తున్న వారికి సమస్యలు వస్తే సంతోషంగా ఎలా ఉండగలరు! వాటిని పరిష్కారం చేసేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నాం. బయోమెట్రిక్, ఐరిస్, వాయిస్ ఇలా వివిధ అంశాల ద్వారా మీ అనుభవాలు తెలుసు కునే ప్రయత్నం చేస్తున్నాము. సీఎం కోర్ డాష్ బోర్డు ద్వారా రియల్ టైం లో వర్షం, భూగర్భజలాలు, వీధి దీపాలు, రిజర్వాయర్లు, ఇలా అన్ని వివరాలు తెలుసుకిగల్గుతున్నాం… అని ముఖ్యమంత్రి అన్నారు.

ఎయిర్ క్వాలిటీ ని కూడా ఇదే స్థాయిలో అందించి ప్రజలకు సంతోషంగా జీవించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో వనరులకు సంబంధించిన సమాచారం అంతా సిద్ధంగా ఉంది. వాటిని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టండి అని పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసారు.

పర్యాటకంగా పుష్కలంగా అవకాశాలు ఏపీలో ఉన్నాయి. సున్నా డిగ్రీలు ఉష్ణోగ్రతలు వచ్చే ఏజెన్సీ ప్రాంతం కూడా ఏపీలో ఉంది. అమరావతి లో 50 వేల కోట్ల విలువ చేసే భూమి రైతులు ఇచ్చారు. అందులో కొంత భూమిని పెట్టుబడులకు కేటాయించి రాజధాని ని ఆర్ధిక వనరుల కేంద్రం గా మారుస్తామని అన్నారు.

ఇప్పుడే పుష్కలమైన అవకాశాలు వినియోగించుకోండి. వాణిజ్య అనుకూల ప్రభుత్వం, వాతావరణం ఉంది రాష్ట్రంలో మంచి పెట్టుబడులతో రండ

మంచి ప్రయోజనాలు దక్కించుకోండి. ఒక్కసారి ఏపీని సందర్శించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూప్ భాగస్వామ్యం:

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైలో టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. టాటా గ్రూప్ సామజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాల పై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావలసిందిగా ముఖ్యమంత్రి టాటా గ్రూప్ ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి అవకాశాలున్నాయని ఆ దిశగా తాము ప్రతిపాదనలతో ముందుకు వస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

డబ్ల్యూ.ఈ.ఎల్.ఎస్.పి.యూ.ఎన్ గ్రూపు చైర్మన్ బాలకృష్ణ గోయెంకా తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగు లో ఆంధ్రప్రదేశ్ తో ఉమ్మడి గా పని చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కి తన ఆసక్తి ని వ్యక్తం చేసారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*