
అల్మాస్గూడ: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడలో దారుణం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన 14ఏళ్ల వైష్ణవి అనే బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానిక రాజీవ్ గృహకల్పలో ఉండే అనసూయ, ప్రభు దంపతుల కుమార్తె వైష్ణవి నిన్న మార్నింగ్వాక్కు వెళ్లి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా రాజీవ్ గృహకల్ప సమీపంలోని చర్చి దగ్గర శవమై కనిపించింది.
తమకు ఎవరితోనూ విబేధాలు లేవని వైష్ణవి తల్లిదండ్రులు తెలిపారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తోందని చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవిని మేనమామ పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
Be the first to comment