ఇబ్రహీంపట్నంలో విషాదం.. రాఖీ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చి…

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులో విషాదకర ఘటన జరిగింది. బొంగుళూరు గేట్ సమీపంలో సాహితీ స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల ప్రతీక అనే చిన్నారి చనిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందంటూ ప్రతీక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన బోయిని వెంకటేష్, చందన తమ కుమారుడు, కుమార్తెతో రాఖీ పండగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఈ ఉదయం పాప బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో సాహితీ స్కూల్ బస్సు టైరు కింద పడి తల పగిలి చనిపోయింది. బంధువుల ఆందోళన కొనసాగుతుండటంతో పోలీసులు ఎంటరయ్యారు. స్కూల్ బస్సును సీజ్ చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారి ప్రతీక చనిపోవడంతో బొంగుళూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతీక తల్లిదండ్రులు, అమ్మమ్మ, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఇటీవల కాలంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో చిన్నారులు చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. యాజమాన్యాలు డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, నైపుణ్యం ఉన్నవారినే డ్రైవర్ ఉద్యోగాలకు తీసుకోవాలని మృతుల బంధువులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*