భూమా నాగిరెడ్డి దంపతుల సమాధి వద్ద అఖిల ప్రియ నివాళి

ఆళ్ళగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో స్వర్గీయ భూమా నాగిరెడ్డి దంపతుల సమాధి వద్ద ఆయన కుమార్తె, ఏపీ టూరిజం మంత్రి అఖిల ప్రియ నివాళి అర్పించారు. భార్గవ్ రామ్ నాయుడుతో రేపు ఉదయం ఆమె వివాహం జరగనుంది. దీంతో తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భూమా నాగిరెడ్డి దంపతుల సమాధి వద్దకు వచ్చారు. నివాళి అర్పించారు. కార్యక్రమంలో అఖిల ప్రియ సోదరి భూమా మౌనిక, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

మరోవైపు రేపు ఉదయం ఆళ్లగడ్డలో జరిగే అఖిల ప్రియ, భార్గవ్ రామ్ వివాహానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరౌతున్నారు.

రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు అఖిల ప్రియ వివాహానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆళ్లగడ్డలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*