
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరుగులు పెడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఏ సందర్భంలోదో తెలియడం లేదు. హెలికాప్టర్‌కు సమీపం దాకా కారులో వచ్చిన పవన్ ఆ తర్వాత కారుదిగి అక్కడే తనకు భద్రత కల్పించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ హెలికాఫ్టర్ వైపు పరుగులు తీశారు. పవన్‌ను చూసిన ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
హెలికాఫ్టర్ వద్దకు పరుగులు తీసిన పవన్ ఆయన స్నేహితులు ఆ తర్వాత హెలికాఫ్టర్ సిబ్బంది సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఎక్కారు. అనంతరం హెలికాఫ్టర్ టేకాఫ్ తీసుకుంది.
పవన్ ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వీడియో … సిల్వర్ స్క్రీన్ సౌజన్యంతో
Be the first to comment