హరికృష్ణతో పాటు కారులోనే ఉన్న శివాజీ, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలివే!

నల్గొండ: నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడి వివాహానికి వెళ్లేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు రావి వెంకట్రావు, శివాజీతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. హరికృష్ణ స్వయంగా కారు నడిపారు. లెఫ్ట్‌సీట్‌లో శివాజీ కూర్చోగా, బ్యాక్ సీట్‌లో వెంకట్రావ్ కూర్చున్నారు. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిలో అన్నెపర్తి వద్ద బోల్తా పడింది. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారు.

ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. కారు రాయిపైకి ఎక్కి అదుపు తప్పింది. బెల్టు పెట్టుకోకపోవడంతో హరికృష్ణ కారులోనుంచి బయటకు పడిపోయారు. శివాజీ, వెంకట్రావ్ మాత్రం కారులోనే ఉండిపోయారు. వీరిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

హరికృష్ణ వాహనం ఢీకొన్న టయోటా కరోలా కారు రోడ్డు అవతలివైపునకు వచ్చి పడింది. కారులో ఐదుగురు ఉన్నారు. వీరంతా నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద శబ్ధం రావడంతో స్థానికుడు ఒకరు ఘటనాస్థలికి చేరుకున్నాడు. వచ్చి చూస్తే కారు పల్టీ కొట్టి పడి ఉంది. డ్రైవర్ సీటులో ఆయనకు ఎవరూ కనిపించలేదు. కొంతదూరంలో ఒకాయన పడి ఉండటాన్ని చూసి దగ్గరికెళ్లి పైకి లేపి చూడగా హరికృష్ణగా గుర్తించారు. వెంటనే 108కు సమాచారం అందించాడు.

స్థానికులు హరికృష్ణతో పాటు శివాజీ, వెంకట్రావ్‌ను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. తొలుత బ్రెయిన్‌డెడ్ అని, ఆ తర్వాత కాసేపటికే హరికృష్ణ కన్నుమూశారని వైద్యులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*