నందమూరి హరికృష్ణ కన్నుమూత

నల్గొండ: కొద్ది సేపటి క్రితం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఈ ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. అన్నపర్తివద్ద వద్ద అద్దంకి హైవేపై వద్ద ఆయన వాహనం బోల్తా పడింది. అవతల రోడ్డులోని మరో వాహనాన్ని నందమూరి హరికృష్ణ వాహనం ఢీ కొంది. ఘటనలో ఎదుటి వాహనలోని ముగ్గురు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఘటనాస్థలానికి బయలుదేరారు.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ బయలుదేరారు.

నందమూరి హరికృష్ణ చనిపోయినట్లు తెలియడంతో టీడీపీ వర్గాలు షాక్‌నకు గురయ్యాయి.

హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009లో కూడా నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ కన్నుమూశారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*