ప్రాజెక్టులలో అవకతవకలపై నాగం వ్యాజ్యం

హైదరాబాద్: తెలంగాణాలోని నీటిపారుదల ప్రాజెక్టులలో అవకతవకలు కొనసాగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టుకు ఆధారాలు సమర్పించారు. జస్టిస్ టి.బి. రాధాకృష్ణన్, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య న్యాయస్థానం ముందు నాగం ఆధారాలతో సహా పొందుపరిచారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ నాగం ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వాదనలు వినిపించారు.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన ఈ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజా ధనం భారీమొత్తంలో చేతులు మారి ప్రైవేట్ సంస్థలకు లబ్ది చేకూరిందని నాగం తన వాదనలు వినిపించారు.కేవలం ప్యాకేజి-5లోనే 1632 కోట్ల అవినీతి జరిగిందని, దీనిమీద తక్షణమే కోర్ట్ జోక్యం చేసుకుని ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని, వేలకోట్ల ప్రజాధనాన్ని పరిరక్షించాలని కోరారు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకూ అన్ని శాసన, విజిలెన్సు మొదలైన సంబంధిత కార్యాలయాలయాలకు సవివరంగా నివేదికలు సమర్పించినా ఏ విధమైన ప్రయోజనంలేక పోవడం వల్లే హైకోర్టుని ఆశ్రయించానని నాగం తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*