టిటిడి పాలక మండలి కీలక నిర్ణయాలు..

తిరుమల: రాజధాని అమరావతి లో టిటిడి నిర్మిస్తున్న శ్రీవారి నూతన ఆలయానికి 150 కోట్లు మంజూరు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 79కోట్ల తో తిరుమల గోవర్ధన అతిధి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.  2015లో సవరించిన పిఆర్.సి ప్రకారం టిటిడి రవాణా విభాగంలో పనిచేస్తున్న 65మంది డ్రైవర్లు, 15 మంది ఫిటర్లకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లకు 15 వేల నుంచి 24వేలు, క్లినర్ల కు 18 వేల రూపాయల వేతనం పెంచింది. తిరుమలలో ఫాస్ట్ ఫుడ్, హోటల్స్‌లో అధిక రేట్ల నియంత్రణకు 5 మంది సభ్యులతో కమిటీని నియమిస్తారు.

తిరుమలలోని వసతి గదుల నిర్వహణకు 19.50 కోట్లతో టెండర్లు పిలుస్తారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృహానికి ఏపీ టూరిజం కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంద్రప్రదేశ్‌లోని కళ్యాణమండపాల నిర్వహణకు 35 కోట్లు కేటాయిస్తారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ భవనాల కాంట్రాక్టును మరో 3 సంవత్సరాల పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంధాలాయాలకు టిటిడి ఆధ్యాత్మిక ప్రచురణలు పంపిణి చేస్తారు. రాబోవు 6 నెలలు కాలంలో నూతనంగా కళ్యాణ మండపాలు మంజూరు చెయబోమని ఈఓ సింఘాల్ తెలిపారు.

తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, బుక్‌లెట్లను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర బోర్డు సభ్యులతో కలిసి తిరుమలలోని ఆన్నమయ్య భవనంలో మంగళవారం నాడు ఆవిష్కరించారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, అక్టోబరు 15న పుష్పక విమానం, అక్టోబరు 17న స్వర్ణరథం, అక్టోబరు 18న చక్రస్నానం జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి  మన్‌మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సుధానారాయణమూర్తి, ఇ.పెద్దిరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి,  జిఎస్‌ఎస్‌.శివాజి, పొట్లూరి రమేష్‌బాబు, సండ్ర వెంకటవీరయ్య, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, అశోక్‌రెడ్డి,  ఎన్‌.కృష్ణ, తిరుమల జెఈవో  కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో పోల భాస్కర్‌ పాల్గొన్నారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ        ఉదయం (9గం|| నుండి 11 గం|| వరకు)

రాత్రి(8 గం|| నుండి 10 గం||ల వరకు)

13-09-2018    సా|| ధ్వజారోహణం (4 నుంచి 4.45 గం||ల వరకు)(మకర లగ్నం), పెద్దశేషవాహనం.

14-09-2018 చిన్నశేష వాహనం హంస వాహనం

15-09-2018 సింహ వాహనం       ముత్యపుపందిరి వాహనం

16-09-2018 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

17-09-2018 మోహినీ అవతారం                గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)

18-09-2018 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

19-09-2018 సూర్యప్రభ వాహనం     చంద్రప్రభ వాహనం

20-09-2018 రథోత్సవం(ఉ.7.30 గంటలకు)     అశ్వ వాహనం

21-09-2018 చక్రస్నానం  ధ్వజావరోహణం

(ఉ.7.30 నుండి 10 వరకు) (రా|| 7 నుంచి 9 వరకు)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*