
హైదరాబాద్: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం పూణే తరలిస్తున్నారు. పూణే కోర్టులో ప్రవేశపెడతారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని హత్య చేయాలని, ఈ ఆపరేషన్‌కు వరవరరావు నిధులు అందించేలా ప్లాన్ చేసినట్లు గతంలో అరెస్టైన మావోయిస్ట్ సానుభూతి పరుడు రొనా విల్సన్ ల్యాప్‌టాప్‌లో లేఖ దొరికింది. ఆ లేఖలో వరవరరావు పేరుండటంతో పాటు నిధులను అందించే ఆరోపణలపై వరవరరావుపై మూడు నెలల క్రితం మహారాష్ట్ర పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు.
ఇవాళ వరవరరావును 8 గంటలపాటు విచారించిన పుణె పోలీసులు అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. వరవరరావు ఇంటి నుంచి ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో మొత్తం ఎనిమిది చోట్ల పూణె పోలీసులు తనిఖీలు జరిపారు. వరవరరావు, ఆయన కుమార్తె, అల్లుడు ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ , జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకులతో పాటు మరో ఇద్దరు విరసం ప్రతినిధుల ఇండ్లలో పూణే, తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. తాళాలు వేసి, ఫోన్స్ స్విచ్ఛాఫ్ చేయించి ఇంట్లోనే విచారిస్తూ ఆధారాలు సేకరించారు. వరవరరావును అరెస్టు చేయొద్దంటూ ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
వరవరరావుకు అనారోగ్యం ఉందని ఆయన భార్య చెప్పడంతో గాంధీ ఆసుపత్రిలో ఆయనకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు.
మూడు నెలల క్రితం రోనా విల్సన్‌తో పాటు అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సురేంద్ర గాడ్లింగ్‌కు నిధులు సమకూర్చినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర లోని గోరేగావ్ లో 2017 ఏప్రిల్ 28 న మావోయిస్ట్ సానుభూతి పరుడు రోనా విల్సన్ కామ్రేడ్ ప్రకాష్ కు రాసిన లేఖను గుర్తించిన ఒక లేఖలో విరసం నేత వరవరరావు నిధులు సమకూర్చినట్టు పోలీసులు గుర్తించారు.
Be the first to comment