మేనమామ గురించి మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే?

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. మేనమామ నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని చూసిన ఏపీ మంత్రి నారా లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. హరికృష్ణ ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా ఉండేవారని, ఏ విషయాన్నైనా కుండ బద్దలుగొట్టిన మాట్లాడేవారని అన్నారు. ఆయన గొప్ప మానవతావాదని కొనియాడారు. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని నివాసానికి హరికృష్ణ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట రోడ్డుమార్గాన సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ బయల్దేరారు. హరికృష్ణ పార్థివదేహం వెంట జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులున్నారు. హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సోదరి భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఇప్పటికే హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.

మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు హరికృష్ణతో సత్సంబంధాలు కలిగిఉన్నారు.

వీడియో సౌజన్యం: AP24x7

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*