హరికృష్ణకు నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల మృతి

ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు ఢీకొన్ని దంపతులు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

రామారావు ప్రయాణిస్తున్న కారు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై కేసరపల్లి వద్దకు రాగానే నున్న నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న హరినారాయణరెడ్డి- సీతామహాలక్ష్మి దంపతులను ఢీకొట్టింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు డివైడర్ పైకెక్కి స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. సీతామహలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, హరినారాయణరెడ్డి పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఎమ్మెల్యే రామారావు అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కారులో చిక్కుకున్న ఎమ్మెల్యేను బయటకు తీసిన ఆయన గన్‌మెన్ గాయాలు కాకపోవడంతో ఆయనను ఆటోలో గన్నవరం విమానాశ్రయానికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*