
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ మృతికి టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. నందమూరి కుటుంబాన్ని మరింత క్షోభకు గురిచేయవద్దని మీడియాను వేడుకున్నాడు. ప్రమాద దృశ్యాలను పదేపదే చూపించి బాధిత కుటుంబ సభ్యులను మరింత ఏడిపించడం తగదని హితవు పలికాడు.
ప్రమాద దృశ్యాలను చూస్తూ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు మరింతగా కుంగిపోతున్నారని, దయచేసి వాటి ప్రచారాన్ని ఆపాలని, ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని వేడుకున్నాడు. తన విజ్ఞప్తిని మీడియా మన్నిస్తుందని ఆశిస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నాడు.
Request the media to stop telecasting #HariKrishna garu’s post accident visuals..It’s disheartening for his family & followers to witness their loved one in such an unexpected way..He belongs to all of us! Pls show some respect????????Hope u oblige our request.Tq #RIPHarikrishnaGaru
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) August 29, 2018
Be the first to comment