కన్నీటి సంద్రంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్

నల్గొండ: కామినేని ఆస్పత్రిలో తండ్రి హరికృష్ణ భౌతికకాయం వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కొన్నేళ్ల క్రితం ఇదే నల్గొండలో సోదరుడు జానకిరామ్‌ను కోల్పోయి, ప్రస్తుతం తండ్రిని కూడా కోల్పోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. హరికృష్ణ సతీమణి షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. రు. అంతకు ముందు హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి పురందేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నాక హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలోనే ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేశారు హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

అటు హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌‌లో ఉన్న హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హరికృష్ణ నివాసానికి సోదరి భువనేశ్వరి, నారా బ్రహ్మణి చేరుకున్నారు.

హరికృష్ణ భౌతికకాయానికి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*