
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరికృష్ణకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. పూలమాలను హరికృష్ణ దేహంపై ఉంచి నమస్కరించారు. వారి వెంట మంత్రి నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. మెయినాబాద్ మండలం ముర్తుజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని నివాసానికి హరికృష్ణ పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట రోడ్డుమార్గాన సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ బయల్దేరారు. హరికృష్ణ పార్థివదేహం వెంట జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులున్నారు.
హరికృష్ణ నివాసానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సోదరి భువనేశ్వరి, నారా బ్రహ్మణి ఇప్పటికే హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.
మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు హరికృష్ణతో సత్సంబంధాలు కలిగిఉన్నారు.
Be the first to comment