
ప్రముఖ నటుడు, హిందూపురం మాజీ ఎమ్మెల్యే హరికృష్ణ మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత విలువైన దానిని కోల్పోయానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన సోదరుడిని కోల్పోయానని, ఏం మాట్లాడాలో.. ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ కుటుంబానికి, మోహన్‌బాబుకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన సోదరుడిలా ఉండేవారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగేవారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లోనూ ఇండస్ట్రీ మొత్తం వద్దని వారిస్తున్నా ఆయనతో ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేశారు. నందమూరి కుటుంబం అంటే మోహన్ బాబుకు అంతటి అభిమానం మరి. ఇప్పుడు ఆయన కుమారుడు హరికృష్ణ మరణంతో మోహన్ బాబు కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో ఇంతకుమించిన లోటు మరోటి ఉండదని పేర్కొన్నారు.
Be the first to comment