
చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప సభ జరగనుంది. హరికృష్ణ అంత్యక్రియల కారణంగా చంద్రబాబు చెన్నై పర్యటన రద్దు చేసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నేడు చెన్నైలో కరుణానిధి సంతాప సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే హరికృష్ణ అంత్యక్రియల కారణంగా తన పర్యటన రద్దు చేసుకుని టీడీపీ ఎంపీలను చెన్నై పంపించారు. చంద్రబాబుకు బదులుగా, టీడీపీ ప్రతినిధులుగా టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ చెన్నై వెళ్లనున్నారు.
ఇటు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని హరికృష్ణ నివాసానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులు తరలివస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమౌతుంది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతాయి.
Be the first to comment