
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన కేసీఆర్ అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. పక్కనే ఉన్న కల్యాణ్ రామ్‌ను పరామర్శించారు.
హరికృష్ణ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛంపై నివాళులర్పించారు. హరికృష్ణ మృతి వార్త తెలిసిన వెంటనే అభిమానులు, పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో జనసందోహంతో ఆయన ఇల్లు నిండిపోయింది. కాగా, హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Be the first to comment