
వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడం వల్లే హరికృష్ణ కారు ప్రమాదానికి గురైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వెనక్కి తిరగడం వల్ల కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎగిరి పడిందని తెలిపారు. హరికృష్ణ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులమంతా షాక్లో ఉన్నట్టు చెప్పారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా అదే ప్రాంతంలో ప్రమాదానికి గురై చనిపోయారని, ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో హరికృష్ణ ప్రమాదానికి గురై మరణించారన్నారు. తారక్ కూడా అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైనా అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్నారు.
హరికృష్ణ ఏ విషయాన్నైనా కుండ బద్దలుగొట్టినట్టు మాట్లాడతారని ముఖ్యమంత్రి తెలిపారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తని కొనియాడారు. సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నిజాయతీ కలిగిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Be the first to comment