దారుణం.. భార్యను దంతాలు ఊడిపోయేలా కొట్టిన మణుగూరు ఎస్‌ఐ

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మణుగూరు ఎస్‌ఐ సముద్రాల జితేందర్ భార్యను దంతాలు ఊడిపోయేలా కొట్టాడు. అత్తను స్పృహ తప్పేలా చావబాదాడు.

తనను కాపురానికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిలదీసేందుకు ఆయన భార్య పర్వీన్ మహిళా సంఘాలతో కలిసి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.

కులాంతర వివాహం చేసుకుని కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. అయితే కొంత కాలంగా కాపురానికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పర్వీన్ మహిళా సంఘాల సహాయం తీసుకుంది. మీడియా ప్రతినిధులను కూడా వెంటతీసుకెళ్లింది. జితేందర్ ఇంటిముందుకెళ్లి నిలదీసింది. అంతే క్షణాల్లో పశువులా మారిన జితేందర్ భార్యను, అత్తను దారుణంగా కొట్టాడు. మొహంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో పర్వీన్ దంతాలు ఊడిపోయాయి. తీవ్ర రక్తస్రావమై ఆమె కుప్పకూలిపోయింది. ఆమె తల్లిని కూడా జితేందర్ చావబాదాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.

మీడియా ప్రతినిధులు దాడిని చిత్రీకరిస్తున్నా జితేందర్ భయపడలేదు. భార్యను, అత్తను పశువులా కొట్టాడు. బూతులు తిట్టాడు. ఆ తర్వాత బ్యాగ్ సర్దుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

తీవ్ర గాయాలపాలైన పర్వీన్‌ను, ఆమె తల్లిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన సబ్ ఇన్‌స్పెక్టర్ పశువులా మారి భార్యను, అత్తను దారుణంగా చితకబాదడం స్థానికులను కలచివేసింది. జితేందర్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*