
హైదరాబాద్: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నగర్లో కలకలం రేగింది. అరవింద్ అనే యువకుడు ఓ బాలిక గొంతు కోసి చంపేశాడు. హతురాలిని పదో తరగతి చదువుతున్న నిఖితగా గుర్తించారు.
కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ అరవింద్ జాదవ్ వెంటపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. వినాయక నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
This post is also available in : English
Be the first to comment