బావమరిది పాడె మోసిన చంద్రబాబు

హైదరాబాద్‌: నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. చితికి హరికృష్ణ రెండో కుమారుడు కల్యాణ్‌రామ్‌ నిప్పంటించారు. అంతకుముందు హరికృష్ణ పార్థివదేహంపై చంద్రబాబు టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు.

 

ఆ తర్వాత మాసబ్‌ట్యంక్ నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నారా లోకేశ్ తదితరులు హరికృష్ణ పాడె మోశారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని, తుమ్మల, ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*