
తిరువనంతపురం: వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు రిలయన్స్ చైర్ పర్సన్ నీతా అంబానీ ముందుకొచ్చారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న అలప్పుజా జిల్లాలోని పల్లిపాడ్ గ్రామంలో పర్యటించారు. స్వయంగా వరద బాధితుల కష్టాలను చూశారు. అనంతరం కేరళ సీఎం పినరాయి విజయన్ను కలుసుకుని 21 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. బాధితులకు నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి కోసం 51 కోట్ల రూపాయలు అందించారు.
కేరళలో వరదల కారణంగా 300 మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్రం 600 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా విరాళాలు ప్రకటించాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చాయి.
This post is also available in : English
Be the first to comment