నిజాం ” భూముల” కు వారసులు ఎవరు?

హైదరాబాద్: కోట్ల రూపాయల విలువైన నిజాం భూములకు నిజమైన హక్కుదారులు ఎవరనే విషయంపై 18 సంవత్సరాలుగా న్యాయస్థానాలలో నలుగుతున్న వ్యాజ్యాలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ ఎట్టకేలకు ముగింపు పలకబోతోంది.8వ నిజాం తన ఎస్‌పిఏ ద్వారా మిర్‌ హసన్‌ అలీ 2000వ సంవత్సరంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

 

 

 

భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 22,01,537.56 స్క్వైర్ మీటర్ల అత్యంత విలువ కలిగిన చిరాన్ ప్యాలస్, ఫలక్‌నామ ప్యాలస్, చౌమహల్లా ప్యాలస్ మొదలైన భూములకు నిజమైన హక్కుదారులు తామేనని, ప్రభుత్వం అన్యాయంగా తమ భూములను ఆక్రమించిందని పిటిషనర్ చెబుతున్నారు.

 

 

పిటిషనర్ తరపు న్యాయవాదులైన సి.హనుమంత రావు, డి.గోపాలకృష్ణ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం చెబుతున్నట్లుగా యూఎల్‌సి యాక్ట్ మరియు ఎల్‌ఏ యాక్ట్ పరిధిలోకి నిజాం భూములు రావని, దావాలో చెప్పబడిన భూములకు మినహాయింపులు ఉన్నాయని సవివరంగా నివేదించారు.

 

వివిధ సందర్భాలలో ఈ వ్యాజ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు, నోటీసులు మరియు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను జతచేరుస్తూ నిజాం తరపు న్యాయవాదులు కోర్టుకు లిఖితపూర్వక నివేదికను సమర్పించారు.

 

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు కూడా విన్న న్యాయమూర్తి టి.అమరనాథ్ గౌడ్ వ్యాజ్యాన్ని వాయిదా వేస్తూ అంతిమ తీర్పును సెప్టెంబర్ 7 2018 నాడు వెల్లడిస్తామన్నారు.

 

 

సోమ శేఖర్, లీగల్ కరెస్పాండెంట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*