పల్లె రఘునాథ్ రెడ్డిని ఓదార్చిన చంద్రబాబు

హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి కన్నుమూశారు. 56 సంవత్సరాల ఉమాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

బాలాజీ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌గా ఉమాదేవి వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చిదిద్దారు. అనేక మందికి ఉపాధి చూపారు. ఆమె మరణంతో బాలాజీ విద్యాసంస్థలలోనూ, పుట్టపర్తిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

సీఎం చంద్రబాబు ఉమాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పల్లె రఘనాథరెడ్డిని ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఉమాదేవి అంత్యక్రియలు అనంతపురంలో జరగనున్నాయి. ఆమె భౌతికకాయాన్ని అనంతపురం అలమూరు రోడ్డులోని పీవీకేకే కళాశాల వద్ద ఉన్న పల్లె నివాసానికి తరలించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*