
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదా కేటాయించాలంటూ రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భావోద్వేగాలకు లోను కావద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. ప్రత్యేక హోదా పోరాట సాధనలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలన్నారు. త్రినాథ్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరి వేసుకుని నిన్న త్రినాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
త్రినాథ్ ఆత్మహత్యపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడాలే తప్ప ఆత్మహత్యలు వద్దని సూచించారు.
Sri YS Jagan has expressed grief over the suicide of a young star Trinath at Nakkapalli Mandal in Vishakapatnam district. He condoled the bereaved family members and appealed the people not to resort to such extreme step but join the fight for SCS to achieve the goal.
— YSR Congress Party (@YSRCParty) August 31, 2018
అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్రినాథ్ ఆత్మహత్యపై స్పందించారు. ఆత్మహత్యలు వద్దని, ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్ ప్రాణ త్యాగాలు చేశారంటూ జనసేన ట్వీట్ చేసింది. యువకుల ప్రాణ త్యాగాలతోనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించింది.
ప్రత్యేక హోదా విషయంలో ఎవరెన్ని మాటలు మార్చినా, సాధనలో విఫలమైనా మనందరం బలంగా ప్రజల ఆకాంక్షను వినిపిద్దాం. దయ చేసి ఎవరూ బలి దానాలకు పాల్పడవద్దు. ఆంధ్ర ప్రదేశ్ కు హోదా దక్కే వరకూ పోరాడదాం – #JanaSena Chief @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) August 31, 2018
స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చి హోదా, విభజన హామీల అమలును పట్టించుకోకపోవడం వల్లే ఇంతకు ముందు తిరుపతిలో ముని కోటి, ఇప్పుడు విశాఖ జిల్లాలో త్రినాథ్ ప్రాణ త్యాగాలు చేశారు – #JanaSena Chief @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) August 31, 2018
బలి దానాలు వద్దు… హోదా దక్కే వరకూ పోరాడదాం – #JanaSena Chief @PawanKalyan pic.twitter.com/SStZhScTeD
— JanaSena Party (@JanaSenaParty) August 31, 2018
Be the first to comment