
గుండెపోటుతో గురువారం రాత్రి కన్నుమూసిన టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు బి.జయకు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంటికి చేరుకున్న మహేశ్ బాబు దంపతులు, వెంకటేశ్, వంశీ పైడిపల్లి, సుకుమార్, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినీరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్, గుణశేఖర్, నృత్యదర్శకుడు శేఖర్, మంచుమనోజ్ తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.
జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన జయ దర్శకత్వంపై మక్కువతో సినీ రంగంలో ప్రవేశించారు. ‘చంటిగాడు’ సినిమాతో సత్తా చాటారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకత్వంలో ప్రతిభ చాటుతున్న ఓ మహిళ దూరం కావడం సినీ రంగానికే తీరని లోటని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
Be the first to comment