ఐసీయూలో విజయ్ కాంత్‌.. ఆందోళనలో అభిమానులు

చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌ ఆసుపత్రిలో చేరారు. పొరూర్ రామచంద్ర ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయ్‌కాంత్ భార్య, కుమారుడు ఈ ఉదయం ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఇటీవలి దాకా ఆయన అమెరికాలో చికిత్స పొంది వచ్చారు. ఈ ఉదయం తిరగబెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

 

 

అసలే కరుణానిధిని కోల్పోయి విషాదంలో ఉన్న తమిళనాడు ప్రజలు విజయ్‌కాంత్ అనారోగ్యంగా ఉన్నారని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. పుకార్లు నమ్మవద్దని, విజయ్‌కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ డీఎండీకే ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

 

వీడియో ఎన్టీవీ సౌజన్యంతో…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*