
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న జగన్ నేడు తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్టణం జిల్లాలో కొనసాగుతోంది.
కోర్టుకు హాజరైన వారిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. అలాగే, అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి కూడా సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ప్రముఖులందరూ కోర్టుకు రావడంతో కోర్టు వద్ద భద్రత పెంచారు.
Be the first to comment