
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న సప్పిడి దశరథ దంపతులను కల్వకుర్తికి చెందిన టీఎస్ 06 యూఏ 9729 నెంబర్ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. భర్త సప్పిడి దశరథ అక్కడికక్కడే చనిపోగా ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఘటనతో తుక్కుగూడలొ విషాద ఛాయలు అలుముకున్నాయి. సప్పిడి దశరథ కుటుంబంలో విషాదం నెలకొంది. పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Be the first to comment