
టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి నివేదన సభ జరగనున్న కొంగరకలాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. 25 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ సభ కోసం 20 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తుండగా మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఆయన కుమార్తె, జగిత్యాల ఎస్పీ సింధూశర్మ ఒకరికొకరు తారసపడ్డారు. దీంతో తనకన్నా పెద్ద హోదాలో విధులు నిర్వర్తిస్తున్న కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేశారు.
సింధూశర్మ సాంస్కృతిక వేదిక వద్ద మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆమె తండ్రి ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తుకు ఇన్చార్జ్గా ఉన్నారు. ఉమామహేశ్వర శర్మ 1985లో ఎస్ఐగా విధుల్లో చేరి నాన్ క్యాడర్ ఎస్పీగా హోదాకు చేరుకోగా, సింధూశర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికై పెద్దపల్లిలో పోస్టింగ్‌లో చేరారు. ఇటీవల ఎస్పీగా జగిత్యాలకు బదిలీ అయ్యారు.
Be the first to comment