
హైదరాబాద్ నగర శివారులోని కొంగరకలాన్‌లో నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ నలుమూలల నుంచి జనాలు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 25 లక్షల మందిని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సభకు ముందు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శన ఉంటుంది. నేటి మధ్యహ్నం ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరగనుంది. సభ పూర్తయిన వెంటనే సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు హెలికాప్టర్ కొంగరకలాన్ చేరుకుంటారు.
ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గంటన్నర సేపు మాట్లాడనున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అభివృద్ధి గురించి వివరించనున్నారు. ఈ 51 నెలల పాలనలో తీసుకున్న500కిపైగా నిర్ణయాల గురించి వెల్లడించనున్నారు. అలాగే, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకాలు ఇతర అంశాలను ఇందులో ప్రస్తావిస్తారు.
Be the first to comment