ట్రూ లవ్ స్టోరీ.. భైరవ గీత ట్రైలర్ విడుదల

హైదరాబాద్: ట్రూ లవ్ స్టోరీ భైరవగీత అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. సిద్ధార్ధ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. సినిమాను రామ్ గోపాల్ వర్మ సమర్పించారు. ధనంజయ, ఇర్రా మోర్ తదితరులు నటించారు.

 

 

నిజమైన ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అక్టొబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

‘సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఈ సినిమా ట్రైలర్ గురించి వర్మ నెటిజన్లను ఊరించారు. ట్విటర్ ద్వారా వరుసగా పోస్టులు పెడుతూ ఆసక్తిని పెంచారు. ఎట్టకేలకూ నేడు ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేశారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*