నాన్న ఆశయ సాధనకు అంకితమౌతా: వైఎస్ జగన్‌

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరంలో ఆయన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఆ తర్వాత అన్నవరం శివారు నుంచి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగించారు. నాన్న అడుగుజాడల్లో నడుస్తానని, నాన్న ఆశయ సాధనకు అంకితమౌతానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

అటు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ సతీమణి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు అంకితమైన తనయుడు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తోన్న యాత్ర సినిమాలోని సమరశంఖం లిరికల్ సాంగ్ వీడియోను చిత్ర టీమ్ విడుదల చేసింది.

 

 

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*