
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు శామ్ కరన్ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత్‌పై టెస్టు సిరీస్‌లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ సిరీస్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరన్ ఇప్పటి వరకు 242 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టుపై ఈ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు డేనియల్ వెటోరీ పేరుపై ఉండేది. ఇప్పుడీ రికార్డును కరన్ బద్దలుగొట్టాడు. 2009లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో వెటోరీ ఎనిమిది, అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 220 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
తాజాగా భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో కరన్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసిన కరన్, రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులుతో క్రీజులో ఉన్నాడు. ఫలితగా 242 పరుగులతో వెటోరీ రికార్డును సవరించారు.
Be the first to comment