
హైదరాబాద్: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు సైరా సినిమా టీమ్ వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పింది. ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించింది. గుండెల నిండా ధైర్యం ఉందంటూ పవన్ బహిరంగ సభల్లో చెప్పిన డైలాగ్‌లను తీసుకుని వీడియోను రూపొందించారు.
ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా రూపొందింది. చిరంజీవి తల్లి అంజనీ దేవి చేతుల మీదుగా ఈ టీజర్ ఈ మధ్యే రిలీజైంది.
సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు నటించారు. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించారు. సంగీతం అమిత్ త్రివేది అందించారు.
Be the first to comment