‘మా’లో నిధుల గోల్‌మాల్‌పై నరేష్ సంచలన ఆరోపణలు

‘మా’లో నిధుల గోల్‌మాల్‌పై నరేష్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్‌పై ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి, నటుడు నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అమెరికాలో ఈవెంట్ చేస్తే రూ. కోటి మాత్రమే రావడమేంటని నరేశ్ ప్రశ్నించారు. నాటి ఈవెంట్‌లో చిరంజీవి కూడా పాల్గొన్నారని ‘మా’లో ఏం జరుగుతుందో కార్యవర్గానికి తెలియాలన్నారు. మా అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని నరేష్‌ ఆరోపించారు. తన తల్లి ఏటా తన పుట్టిన రోజున 75 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారని, ఇప్పటివరకూ 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారని నరేశ్ చెప్పారు. త్వరలో మహేష్‌తో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పామని నరేశ్ వెల్లడించారు. మా ఆఫీసులో ఏడాది పాటు సమావేశాల దృశ్యాలు రికార్డు కాలేదని, తన ఆరోపణలపై శివాజీ రాజా సమాధానం చెప్పాలని నరేష్‌ డిమాండ్ చేశారు. నిధుల గోల్‌మాల్‌పై మీడియాలో వార్తలు వచ్చాక శివాజీరాజా కనిపించడం లేదని నరేష్‌ చెప్పారు. నిధుల గోల్‌మాల్‌పై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని నరేష్‌ డిమాండ్ చేశారు. గుండు గీయించుకుంటా.. మీసాలు కొరుక్కుంటానని అనబోనని, చిన్నపిల్లాడిలా ఒట్లు వేయనని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*