బ్రేకింగ్ న్యూస్: గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో వెలువడిన తీర్పు

హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్కుల వద్ద 2007లో జరిగిన పేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చర్లపల్లి జైలులో తీర్పు వెల్లడించారు. ఇస్మాయిల్ చౌదరీ, అనిఫ్ షఫీక్ సయీఫ్‌లను దోషులుగా నిర్ధారించారు. ఏ1, ఏ2 లను మాత్రమే దోషులుగా నిర్దారించారు. ఫరూఖ్, షఫ్రద్దీన్, సాధిక్ ఇసార్, అంజుమ్‌ను నిర్దోషులుగా ప్రకటించారు. సోమవారం శిక్షలు ఖరారు చేస్తారు.

నిందితుల్లో రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు.

2007లో జరిగిన ఈ పేలుళ్లలో 34 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది శాశ్వత వికలాంగులయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*