
కేశంపేట్: రంగారెడ్డి జిల్లా కేశంపేట్ పోలిస్టేషన్ పరిధిలోని సాజీదా ఫామ్ హౌస్‌పై శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల ధాడులు చేశారు. ముజ్రా పార్టీ (వ్యభిచారం) నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 11 మంది యువకులు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. రూ 25,240 నగదుతో పాటు రెండు కార్లు ఒక బైక్, 26 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు.
పట్టుబడిన వీరందరినీ కేశమ్ పేట్ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు ముంబై, ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన యువతులుగా గుర్తించారు. యువకులంతా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారేనని గుర్తించారు.
Be the first to comment